calender_icon.png 13 November, 2024 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలపై విచారణ

31-08-2024 03:47:25 AM

పురపాలక శాఖ నుంచి ఆదేశాలు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 30 (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై పురపాలక శాఖ దృష్టి సారించింది. సర్వే నంబర్ 42లోని ప్లాట్ నంబర్ 58, 59లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ‘కమిష(న్)నర్ మేడలు’ శీర్షికన ఇటీవల విజయక్రాంతి కథనం ప్రచురింది. ఈ కథనాన్ని జతచేస్తూ ఎడవల్లి రఘువర్ధన్‌రెడ్డి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.

స్పందించిన పురపాలక శాఖ జాయింట్ డైరెక్టర్ నారాయణరావు మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ పర్యవేక్షణలో విచారణ చేయాలని పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ త్రిల్లేశ్వర్‌రావును ఆదేశిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులపై కమిషనర్ గోప్యత పాటిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న  స్థానిక కార్పొరేటర్ భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.