calender_icon.png 10 January, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ

10-01-2025 01:42:16 AM

ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో నలుగురు విద్యార్థులకు అస్వస్థత

మానకొండూర్, జనవరి 9: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని  ఎల్‌ఎం డి కాలనీలో గల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లోని విద్యార్థులకు ఫుడ్ పాయిజనై అస్వస్థకు గురైన ఘటన బుధవారం రాత్రి చోటు చేసు కున్న విషయం తెలిసిందే.. ఎల్‌ఎండి ప్రభు త్వ పాఠశాలలో చదువుతున్న అరణ్య కళ్యా ణి, నందిని,తో పాటు మరో ఐదుగురు వి ద్యార్థినిలు బుధవారం మధ్యాహ్నం పాఠశా లలో భోజనం చేసి సాయంత్రం సమీపం లోని; ఇంటిగ్రేటెడ్ హాస్టల్లోకి వెళ్లారు.

కొంత సమయం తర్వాత వారికి కడుపునొప్పి రావడంతో సమీపంలోని ప్రైవేటు వైద్యుడి వద్ద చూపించారు. అందులో 4 గురికి కడు పునొప్పి తగ్గకపోవడంతో కరీంనగర్ ప్రభు త్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిం చారు. ఈ ఘటనపై; డిటిఓ నాగలేశ్వర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ విజయ పాల్ రెడ్డి లు గురువారం పాఠశాలను సందర్శించి విద్యార్థులను ఆరోగ్య సమస్యపై జరిగిన ఘటనపై అడిగి తెలుసుకున్నారు.

తరం వారు మాట్లాడుతూ తమకు ఆరోగ్య సమస్యతోపాటు ఏలాంటి సమస్య ఉన్న సంబంధిత ప్రిన్సిపల్ దృష్టికి తీసుకురా వాలని తెలిపారు. విద్యార్థులకు అందించే భోజనంలో ఎలాంటి అవకతవకలు పాల్పడి నప్పటికీ చర్యలు చేపడతామని హెచ్చరిం చారు.

విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలిం చారు.ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలక డగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంద ర్శనలో ఎంపీడీవో విజయ్ కుమార్ డిప్యూ టీ తాసిల్దార్ లక్ష్మణ్, ఎంపీఓ సురేందర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మౌనిక, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు ఉన్నారు.