calender_icon.png 15 November, 2024 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీడీఎస్‌లో అవినీతిపై విచారణ

14-11-2024 12:00:00 AM

నివేదికను కమిషన్‌కు సమర్పిస్తానని ఆర్జేడీ వెల్లడి

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 13 (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్త్రీ శిశు మాతా సంరక్షణ శాఖ (ఐసీడీఎస్)లో అవినీతి అధికారులపై రీజినల్  జాయింట్ డైరెక్టర్ వరంగల్ జాన్సీ రెండు రోజుల పాటు క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. టేకులపల్లి, పాల్వంచ ప్రాజెక్టుల్లో అధికారుల అవినీతి అక్రమాలపై ఇటీవల విజయక్రాంతిలో వరుస కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆర్జేడీ విచారణ చేపట్టారు.

ఈ నెల 12న టేకులపల్లి ప్రాజెక్టులో సీడీపీవో మంగతా యారుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై, బుధవారం పాల్వంచ ప్రాజెక్టులో గతంలో పనిచేసిన సీడీపీవోగా పనిచేసిన కనకదుర్గ, షిర్డీసాయినగర్ సూపర్‌వైజర్ శారదపై వచ్చిన ఆరోపణలపై అంగన్‌వాడీ టీచర్ల నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు సేకరించారు. అంగన్ వాడీలపై జరిపిన వేధింపులపై ప్రతి టీచర్ నుంచి విడివిడిగా వివరాలు సేకరించారు. నివేదికను కమిషన్‌కు సమర్పిస్తామని ఆర్జేడీ వెల్లడించారు.