calender_icon.png 28 November, 2024 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలుషిత ఆహారంపై విచారణ

28-11-2024 01:52:59 AM

మాగనూర్ స్కూల్‌ను సందర్శించిన రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్

నారాయణపేట, నవంబర్ 27 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ ఉన్నత పాఠశాలను రాష్ట్ర స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ వెంకటనరసింహరెడ్డి బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి సందర్శించారు. మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. పాఠశాలలో నిల్వ ఉంచిన బియ్యం, వంట గదిని, వంట సరుకులను పరిశీలించారు.

తాగునీటి నమూనాలను పరిశీలించా రు. విద్యార్థులకు అందజేస్తున్న భోజనంపై వంట ఏజెన్సీ నిర్వాహకులను విచారించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి సౌభాగ్యలక్ష్మిని అడి గి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, కలెక్టర్‌తో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

అనంతరం ఎస్పీ యోగేష్ గౌతమ్, అదనపు కలెక్టర్ బేన్ షాలంతో కలి సి ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులు, గ్రామ మహిళా సంఘం సభ్యులు, పదోతరగతి విద్యార్థులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. మంగళవారం జరిగిన ఘట నపై ఆరా తీశారు. నాణ్యమైన సరుకులు ఉపయోగించి భోజనం వండాలని సూచించారు.

ఇకపై ఇలాంటి సంఘటనలు పునరా వృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. మధ్యాహ్నం భోజనానికి ముందు, వంట చేసిన తర్వాత భోజనాన్ని పరిశీలించిన తర్వా తే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు.