10-04-2025 12:00:00 AM
గచ్చిబౌలి పోలీసుల విచారణలో బీఆర్‌ఎస్ నేతలు క్రిశాంక్, దిలీప్
ఏఐ ఫొటోలు, వీడియోల సృష్టిపై విచారణ
నేడు, రేపు హాజరుకానున్న నేతలు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కంచె గచ్చిబౌలి భూముల కు సంబంధించి ఏఐని ఉపయోగిం చి సోషల్ మీడియాలో నకిలీ ఫొ టోలు, వీడియోలు పోస్టు చేశారం టూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌కు గచ్చిబౌలి పోలీసులు ఈ నె ల 9, 10, 11వ తేదీల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇ చ్చారు.
ఈ మేరకు బుధవారం మ న్నె క్రిశాంక్, దిలీప్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11:30 గంటలకు పోలీసు ల ఎదుట హాజరయ్యారు. వారిని వి చారించిన పోలీసులు సోదాల నిమి త్తం మొబైల్ ఫోన్లను అడగగా.. ఇం టి వద్దే ఉన్నాయని ఇద్దరూ బదులిచ్చినట్టు సమాచారం. ఏఐ ఫొటోలు, వీడియోలపై బుధవారం రాత్రి వర కు విచారించిన అనంతరం పోలీసు లు వారిని ఇంటికి పంపించారు. కా గా గురువారం, శుక్రవారం కూడా విచారణకు క్రిశాంక్, దిలీప్ హాజరుకానున్నారు.
కాంగ్రెస్‌వి ద్వంద్వ ప్రమాణాలు: హారీశ్‌రావు
తెలంగాణ పోలీస్ అధికారులు తమ నేతలు కొణతం దిలీప్, క్రిషాంక్‌లను 9గంటలు విచారించడం ప్రజాపాలన అనిపించుకుంటుందా అని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వా న్ని ప్రశ్నించారు. హెచ్‌సియూ విద్యార్థలు, హైదరాబాద్ జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు మద్దతు ఇచ్చారన్నారు. ఇప్పుడు వారి ఫోన్ల కోసం వారి ఇళ్లల్లో రాత్రిపూట సోదాలు చేయడం దారుణమని హారీష్ రావు విమర్శించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహు ల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో విలువలను ఖూ నీ చేయడం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని మండిపడ్డారు.