calender_icon.png 17 January, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీబీ ఫైల్స్ దహనం కేసులో దర్యాప్తు వేగవంతం

11-07-2024 02:34:15 AM

హైదరాబాద్, జూలై 10  (విజయక్రాంతి): పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీ బీ) ఫైల్స్ దహనం కేసులో పోలీసులు దర్యా ప్తు వేగవంతం చేశారు. పెమలూరు సీఐ రామారావు ఆధ్వర్యంలో పోలీసు బృందం బుధవారం విజయవాడ పీసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టింది. కార్యాలయం నుంచి ఫైళ్లు బయటకు వెళ్లడంపై అధికారులను ప్రశ్నించారు. ఫైల్స్  హార్డ్ డిస్క్‌లు, బయటకు వెళ్లడంలో అధికారుల పాత్ర, కాల్చిన ఫైల్స్‌లోని అంశాలు, వాటి ప్రాధాన్యతపై ఆరా తీశారు. ఫైల్స్‌లోని సమాచారంపై  సిబ్బంది వాంగ్మూలం నమోదు చేశారు. ఫైల్స్ దహనంపై  సమగ్ర నివేదిక సమర్పించాలని ఉపముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.