03-04-2025 12:54:22 AM
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావుపై విచారణ ముగిసింది. బుధవా రం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరిపిన విచారణలో అధికారులు అడిగిన పత్రాలను సమర్పించిన శ్రవణ్‌రావు కొన్నింటికి అసంపూర్తిగా సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో శ్రవణ్ రావుకు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 8వ తేదీన విచారణకు రావాలని ఆదేశా లు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌రావు ఏ6గా ఉన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉం చాలనే విషయంలో శ్రవణ్ సూచనల మేరకే కీలక నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు నడుచుకున్నారనేది సిట్ ప్రధాన అభియోగం.
అయితే గతేడాది మార్చిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే శ్రవణ్ రావు అమెరికాకు పారిపోయారు. అప్పటి నుంచి సిట్ విచారణకు దూరంగా ఉన్నారు. అనంతరం అరెస్ట్ పరిణామాల దగ్గరి నుంచి సుప్రీంకోర్టులో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట పొందిన ఆయన దర్యాప్తుకు సహకరించాలని సిట్ కోరింది.
ఈ మేరకు శ్రవణ్ రావు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృం దం (సిట్) ఎదుట హాజరయ్యారు. తొలుత నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సిరిసిల్ల డీసీఆర్‌బీ.. అప్పటి డీఎస్పీ ప్రణీత్‌రావు పేరు మాత్రమే చేర్చింది. దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్దీ నిందితుల జాబితా పెరుగు తూ వచ్చింది. ఈ క్రమంలో శ్రవణ్ రావును ఏ6గా చేరుస్తూ పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు.