calender_icon.png 8 January, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దృష్టి మళ్లించేందుకే కేటీఆర్‌పై విచారణ

07-01-2025 01:25:12 AM

* రైతుల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు డ్రామాలు

* మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): రైతుల ఆగ్రహం నుంచి దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం కేటీఆర్‌కు ఏసీబీ నుంచి నోటీసు ఇప్పించారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమ లు చేయలేక కొత్త చిక్కులు కొనితెచ్చుకున్నారని, ప్రతి విషయంలో బొక్కా బోర్లా పడు తున్నారని ఎద్దేవాచేశారు.

సోమవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. రైతు భరోసా రూ.12 వేలు అంటూ చావు కబురు చల్లగా చెప్పారని, పనికి మాలిన చెత్త సమాచారం లీకుల రూపంలో ఇస్తున్నారని, తన మామ సంవత్సరీకం ఉన్నప్పటికీ ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ వెళ్లారని గుర్తుచేశారు. న్యాయవాదిని అనుమతిం చక పోలీసులు 45 నిముషాలు రోడ్డుపై నిలబెట్టారని, పట్నం నరేందర్‌రెడ్డి విషయం లోనూ ఇలాగే వ్యవహరించారని మం డిపడ్డారు.

విచారణాధికారే కేటీఆర్ వద్దకు వచ్చి ఆయ న నుంచి లేఖ తీసుకోవడంతో ప్రభుత్వం నవ్వుల పాలయ్యిం దన్నారు. దీంతో మళ్లీ ఎలెక్టోరల్ బాండ్స్ విషయాన్ని ఏదో కొత్తగా కనిపెట్టినట్టు లీకు లు ఇచ్చారని, ఇందులో కొత్త ఏముందని, ఎలెక్టోరల్ బాండ్స్ పబ్లిక్ డొమేన్‌లో ఉన్నవేనని చెప్పారు.

గ్రీన్ కో కంపెనీ అన్ని పార్టీల కు బాండ్స్ ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీకి కూడా రూ.27 కోట్ల విరాళాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఫార్ములా ఈ కేసే చెత్త కేసు అని, కేటీఆర్ ఓ హీరోలా ఏసీబీ విచారణకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఇప్పుడు జరి గే విచారణలన్నీ తోలు బొమ్మలాట విచారణలేనని వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బాల్క సుమన్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.