calender_icon.png 19 January, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసైన్డ్ భూమిపై విచారణ చేయండి

07-08-2024 02:35:55 AM

తహసీల్దార్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్‌లో మాజీ సైనికుడికి కేటాయించిన భూమికి సంబంధించిన వివాదంపై ఆర్డీవో ఉత్తర్వుల ప్రకారం తాజాగా విచారణ జరపాలంటూ తహసిల్దార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. విచారణ సందర్భంగా అన్ని పార్టీలకు నోటీసులు జారీచేసి వారి వాద నలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంచేసింది.

అప్పటివరకు మూడెకరాల భూమిపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. శం షాబాద్ మండలం పెద్దషాపూర్లో మాజీ సైనికుల కోటాలో కేటాయించిన మూడెకరాల్లో 2 ఎకరాలను ఖారిజ్ఖాతాగా పేర్కొంటూ ఎమ్మార్వో కలెక్టర్‌కు రాసిన లేఖను సవాలు చేస్తూ ఎం శ్యాంసుందర్‌రావు పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ జే శ్రీనివాసరావు విచారణ చేపట్టి ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. విచారణ జరపాలని ఆర్డీవో ఎమ్మార్వోకు ఆదేశాలు జారీచేసినప్పటికీ దాన్ని పట్టిం చుకోకుండా శ్యాంసుందర్‌రావు విక్రయించిన ఎకరం స్థలానికి మ్యుటే షన్ చేసివ్వడం చెల్లదని చెప్పారు. తాజాగా విచారణ జరిపి నిర్ణయం వెలువరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.