calender_icon.png 9 February, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుద్రంగి పంచాయతీలో అక్రమాలపై విచారణ చేయండి

09-02-2025 01:50:21 AM

చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రం గి పంచాయతీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధి కారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రం గి పంచాయతీలో పంచాయతీ అధికారి, కార్యదర్శులు అక్రమాలకు పాల్పడతున్నారని గతేడాది డిసెంబర్ 9న వినతి పత్రం సమర్పించినా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ రుద్రంగికి చెందిన  పీ నరేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది తీగల రాంప్రసాద్ వాదనలు వినిపిస్తూ పంచాయతీ కార్యాల యంలో మండల పంచాయతీ అధికా రి పీ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి రాందాస్ చౌహాన్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. డబ్బు కోసం ప్రభుత్వానికి చెందిన భూమిలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు మంజూ రు చేస్తున్నారన్నారు.

ప్రభుత్వ భూము ల్లో షెడ్ల నిర్మాణం జరిగిందని, వాటిని తొలగించి రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాద నలు వినిపిస్తూ డివిజనల్ పంచాయతీ అధికారి దీనిపై విచారణ జరిపించి నివేదిక తెప్పించారన్నారు.

ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్ సమక్షంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటా మన్నా రు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం కోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీలో అక్రమాలపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణ మూసివేసింది.