calender_icon.png 15 October, 2024 | 5:55 AM

మరిన్ని పెట్టుబడులు పెట్టండి

15-10-2024 03:38:29 AM

  1. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తాం
  2. ఫాక్స్‌కాన్ చైర్మన్, సీఈవో యాంగ్ లియూకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
  3. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కార్యాలయ సందర్శన

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : తెలంగా ణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని ఫాక్స్‌కాన్ చైర్మన్, సీఈవో యాంగ్ లియూను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ (ఎఫ్‌ఐటీ) కార్యాలయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సందర్శించారు.

ఈ సంద ర్భంగా ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సంస్థ పురోగతిపై ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత సమ యంలో వారి ప్రాజెక్టు పూర్తికావడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రసుత్తం తెలంగాణలో కొనసాగుతున్న ఫాక్స్‌కాన్ కంపెనీ పురోగతి పనులు, భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టుల పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ చైర్మన్, సీఈవో యాంగ్ లియూతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లా డారు. ప్రాజెక్టుకు సంబంధించి కొనసాగుతున్న పనులపై చర్చించారు.

కొన్ని ఆపరేషనల్ అంశాలను ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ సీఈవో, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన సీఎం ఏవైనా సమస్య లుంటే తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారు లను ఆదేశించారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపా యాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

ప్రపంచస్థాయి సాంకేతిక పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా నిలుస్తుందనడానికి ఈ సందర్శన ద్వారా స్పష్టమవు తుందని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఫాక్స్‌కాన్ సంస్థను సందర్శించిన వారిలో మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నారు.