calender_icon.png 27 January, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

26-01-2025 12:52:39 AM

  • ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’కి ప్రోత్సాహకాలు

స్విస్ కంపెనీలను కోరిన మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అ న్ని విధాలా అనుకూలమని, నిస్సంకోచంగా స్విస్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ ఇన్నోవేషన్ పార్క్‌లో శనివారం 40కి పైగా స్విస్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు.

పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రాష్ట్రప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని వెల్లడించారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై పెట్టుబడులు పెట్టేవారిని తాము ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు.  తెలంగాణలో ఇప్పటికే స్విట్జర్లాండ్‌కు చెందిన ఎన్నో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని, రాష్ట్రంలో ఆయా కంపెనీలు విజయవంతంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని వివరించారు.

హైదరాబాద్‌లో నైపుణ్యత కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తాము తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. సదస్సులో స్విస్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు నికోలస్ గుగ్గర్, భారత్‌లో స్విట్జర్లాండ్ రాయబారి హెచ్‌ఈ మాయా టిస్సాఫీ పాల్గొన్నారు.