calender_icon.png 20 January, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

20-01-2025 12:32:45 AM

ఆస్ట్రేలియా సంక్రాంతి సంబురాల్లో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఎల్లలు దాటాయని, ఆస్ట్రేలియాలో కూడా మన పండుగలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కొనియాడారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో తెలుగు అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాలకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. తెలుగు పల్లెల్లో లాగానే ఆస్ట్రేలియాలో కూడా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. తెలంగాణలో తెలుగు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరారు.