calender_icon.png 15 November, 2024 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి

11-11-2024 01:39:04 AM

  1. మలేషియా పారిశ్రామిక వేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
  2. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం
  3. దేశానికి ఎంట్రీ పాయింట్‌గా హైదరాబాద్ 

హైదరాబాద్, నవంబర్ 10 (విజయ క్రాంతి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని మలేషియా పారి శామికవేత్తలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తాము తీసుకువచ్చిన సులభతర వాణిజ్య విధానాల వల్ల పరిశ్రమల స్థాపన కు దేశంలో ఎక్కడా లేనంత అనుకూల వా తావరణం ఏర్పడిందని వెల్లడించారు.

మలేషియా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరైన శ్రీధర్‌బాబు ఆదివారం కౌలాలంపూర్ లో అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ మలేషియాభారత్‌ల మధ్య వాణిజ్య సం బంధాలు మరింత బలపడాలని తాము కో రుకుంటున్నట్టు వివరించారు.

రెండు దేశాల సంస్కృతుల్లో అనేక సారూపత్యలు ఉన్నందున పరస్పర సహకారం మరింత తేలిక అవుతుందని ఆకాంక్షించారు. పెట్టుబడుల తో తమ దేశానికి వచ్చే వారందరికీ హైదరాబాద్ ఎంట్రీ పాయింట్‌గా ఆహ్వానం పలుకు తోందని వెల్లడించారు. డిసెంబర్‌లోగా పారిశ్రామికవేత్తలు తెలంగాణను సందర్శించేం దుకు  ఏర్పాట్లు చేస్తున్నామని  తెలిపారు.

రాజకీయ ప్రస్థానానికి 25 ఏళ్లు..

అనూహ్య పరిస్థితుల్లో ప్రజాసేవలోకి వచ్చిన తాను ప్రజాప్రతినిధిగా నవంబర్ 10తో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం అక్కడి మిత్రులు చెప్పేదాక తనకు గుర్తు లేదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో పార్టీలో ఎంతో ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తూ వచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్‌ఖర్గేలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. మంత్రిగా తాను పనిచేసిన నలుగురు సీఎంలు తన పట్ల ఎంతో ఆదరాభిమానాలు కనబర్చారని తెలిపారు. ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తున్న సహచరులకు, తన వెంట నిలిచిన ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.