calender_icon.png 9 January, 2025 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'విజయక్రాంతి' క్యాలెండరు ఆవిష్కరణ

08-01-2025 07:32:54 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): మండల ఎమ్మార్వో ఆధ్వర్యంలో 'విజయక్రాంతి' క్యాలెండరు-2025 ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలోని పలు ప్రజా సమస్యల పరిష్కారానికి పాత్రికేయుల కృషి వెలకట్టలేనిదని అన్నారు. విజయక్రాంతి దినపత్రిక బాధ్యతయుతంగా పని చేసి ప్రజల మన్నలను పొందాలని సూచించారు. ప్రజలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి పాత్రికేయులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారధిగా నిలుస్తారని అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం, ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా ఎంతో బాధ్యతగా స్వీయ నియంత్రణతో పని చేస్తుందన్నారు. విజయక్రాంతి దినపత్రిక ప్రజల పక్షాన నిలిచి సమాజంలో ప్రత్యేకతను సాధించి దినదినం అభివృద్ధి చెందాలని తెలిపారు. అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్, పోలీస్ స్టేషన్ లో కూడా విజయక్రాంతి దినపత్రిక-2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయక్రాంతి రిపోర్టర్ చెరుకు వేణుగోపాల్, పాత్రికేయులు శశిధర్, జావేద్, లక్ష్మీ రాజం, షాహిద్ తదితరులు పాల్గొన్నారు.