calender_icon.png 4 April, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ ను సత్కరించిన ఐఎన్టియుసి బృందం

03-04-2025 10:41:45 PM

భద్రాద్రి (విజయక్రాంతి): పీవీకే మైన్ విజిటింగ్ కు వచ్చిన డైరెక్టర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు ను, ఐఎన్టీయుసి కేజీఎం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ నాయకత్వంలో స్వాగతం పలికారు. మొదటి సారిగా కొత్తగూడెం ఏరియా పీవీకే 5మైన్ కు వచ్చిన సందర్బంగా, కేజీఎం ఏరియాలో ప్రాధాన్యతను సంతరించుకున్న, వీకే ఓసీలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను సింగరేణి కార్మికులతో చేపట్టాలని,  డిప్యూటేషన్ పై జెవిఆర్ ఓసీ లో పనిచేస్తున్న కార్మికులను కేజీఎం ఏరియాలోనే సర్దుబాటు చేయాలనీ, పీవీకే 5 మైన్ కు నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. డైరెక్టర్ ను కలసినవారిలో ఐఎన్టీయుసి నాయకులు బూటుక రాజేశ్వర్ రావు డిప్యూటీ జనరల్, చిలక రాజయ్య పిట్ సెక్రటరీ, బి. సైమన్ బ్రాంచ్ సెక్రటరీ, టీ. నాగార్జున జీఎం స్ట్రక్చర్ కమిటీ మెంబెర్, జి. నవీన్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్, వల్లాల. సాంబ మూర్తి అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ, సిల్ వెరీ. రామస్వామి తదితరులు పాల్గొన్నారు.