పెద్దపల్లి (విజయక్రాంతి): కార్మిక నేత ఐ.ఎన్.టి.ఎస్.సి సీనియర్ నాయకులు సెంట్రల్ కౌన్సిలింగ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగ బుచ్చయ్య తల్లి దుర్గమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బుధవారం వారి స్వగ్రామమైన ధర్మారం మండలంలోని బొట్ల వనపర్తి గ్రామంలో ఐఎన్ టియుసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఐఎన్టియుసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాంపల్లి సమ్మయ్య, బుధవారం పరామర్శించారు. దుర్గమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన వెంట మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, సెంట్రల్ కమిటీ కార్యవర్గ సభ్యులు మేడ సమ్మయ్య, కేంద్ర కమిటీ కార్యదర్శులు పానుగంటి వెంకటస్వామి, రాపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.