calender_icon.png 10 January, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక నేత కుటుంబానికి ఐఎన్టియుసి నాయకుల పరామర్శ

09-01-2025 04:18:46 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): కార్మిక నేత కుటుంబానికి ఐఎన్టియుసి నాయకులు గురువారం పరామర్శించారు. ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు సెంట్రల్ కౌన్సిలింగ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగ బుచ్చయ్య తల్లి దుర్గమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆర్కేపి ఓసిపి ఫిట్ సెక్రెటరీ చెప్యల రమేష్, ఐఎన్టియుసి నాయకులతో కలిసి స్వగ్రామమైన బొట్ల వనపర్తిలో పరమర్శించారు. దుర్గమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వారి వెంట ఐఎన్టీయూసీ నాయకులు బొడ్డు తిరుపతి, నాగుల రామారావు, బట్టు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.