ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ...
మందమర్రి (విజయక్రాంతి): ఐఎన్టీయుసీ నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని బెదిరింపులకు గురి చేస్తూ నెలల తరబడి సర్ఫేసులో విధులు నిర్వహిస్తున్నారని ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ ఆరోపించారు. ఏరియాలోని కేకే ఓసిపిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎఐటియుసి కార్యకర్తలు అనారోగ్యంతో బాధపడుతున్న వారు మినహా మిగిలినవారు వారి వారి విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. సర్ఫెస్ డ్యూటీల విషయంలో ఏఐటియుసి యూనియన్ ను విమర్శించడం హాస్యాస్పదం ఆన్నారు. 2003 సంవత్సరంలో ఐఎన్టియుసి యూనియన్ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో కక్ష సాధింపు చర్యలకు పూనుకున్న చరిత్ర కార్మికులు మరిచిపోలేదని ఆయన గుర్తు చేశారు. తమ యూనియన్ కార్మికులకు అన్యాయం జరిగితే వెంటనే స్పందిస్తూ సమస్యలు పరిష్కరించడంలో ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.
కార్మికులు ఐఎన్టియుసి చౌకభారు మాటలు నమ్మవద్దని కోరారు. ఐఎన్టియుసి యూనియన్ కి దమ్ముంటే మీ ప్రభుత్వం ఎన్నికలలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాల నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. ఎర్రజెండా సంఘం కార్మికుల పక్షాన పోరాడుతుందని, ఐఎన్టియుసి యూనియన్ యాజమాన్యం తొత్తులుగా వ్యవహరిస్తు తమ యూనియన్ పై అసత్య ఆరోపణలు చేయడం మానుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కృషి చేయాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శన్, సహాయ కార్యదర్శి సోమిశెట్టి రాజేశం, ఆర్నకొండ ఆంజనేయులు, సివి రమణ, టేకుమట్ల తిరుపతి, గోపతి సత్యనారాయణ, పిట్ కార్యదర్శి మర్రి కుమార్, రాజేష్ యాదవ్, ఆంటోనీ, దినేష్, పోగుల రమేష్, మిట్ట పోషంలు పాల్గొన్నారు.