విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి.
ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి.
ఐఎన్టియుసి జిల్లా కార్యదర్శి చింతకాయల రాము.
హుజూర్ నగర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యారగాని నాగన్న గౌడ్ ఆదేశాల మేరకు ఐఎన్టీయూసి సూర్యాపేట జిల్లా కార్యదర్శి చింతకాయల రాము ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో అత్యధిక ధనవంతుల ఆదాయంపై సంపద టాక్స్ ను పెంచి, విద్యా, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు కేటాయించాలన్నారు. అడ్డగోలుగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను, విద్యుత్ సవరణ బిల్లు- 2022ను రద్దు చేయాలన్నారు. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల జీవోలను సవరించి పెరుగుతున్న నిత్యవసరాల వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు.
బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిలుపుదల చేయాలని, సింగరేణికి నేరుగా గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మికులకు కనీస వేతనంగా రూ 26 వేలను, రూ. 10 వేల రూపాయల పెన్షన్ ను అందించాలన్నారు. కాంట్రాక్టు విధానం రద్దుచేసి, ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి,ఐ ఎన్ టి యు సి సీనియర్ నాయకులు యరగాని గురవయ్య గౌడ్, మేకల నాగేశ్వర రావు, ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి, మలిదశ ఉద్యమకారుడు యడ్ల విజయ్, మద్దo నాగేందర్, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కందుల వెంకటేశ్వర్లు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు భూపతి శ్రీను, హౌస్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నాగేందర్, ఐతగాని వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.