22-03-2025 05:08:13 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం కాసిపేట 1 ఇంక్లైన్, కాసిపేట 2 ఇంక్లైన్ గనుల పైన ఐఎన్టియుసి జనరల్ సెక్రెటరీ, రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ బి .జనక్ ప్రసాద్ ఆదేశాలతో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రి మండలి సభ్యుల చిత్రపటాలకు ఐ ఎన్ టి యు సి కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు, క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కాంపెళ్లి సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్యలు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఐఎన్టియుసి సీనియర్ ఉపాధ్యక్షులు కాంపెళ్లి సమ్మయ్య మాట్లాడుతూ... రాహుల్ గాంధీ జోడోయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారంగా కేంద్రంలో, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీ కులగనణ చేపడతామని దేశ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే కులగణన చేసి, కమిటీ వేసి నివేదిక అనంతరం అసెంబ్లీలో బిసి రిజర్వేషన్లు 23 శాతం నుండి 42 శాతం పెంచారని అన్నారు. ఎస్ సి వర్గీకరణ బిల్లు ఆమోదం పొందేలా చట్టం చేయడం అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 1931 లో బిసి కులగనణ, సమగ్ర కులగణ జరిగిందని అప్పటినుండి నేటి వరకు బీసీ కులాలను చేపట్టకపోవడంతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన జోఢయాత్రలో బీసీ కులస్తులు పడుతున్న వేదనను వారి కష్టాలను దగ్గరుండి చూసి బీసీ సమగ్ర కులగణన అవసరం అనే ఒక నిర్ణయానికి వచ్చారని తెలిపారు.
ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలకు ఆరాధ్యుడుగా మారారని అన్నారు. ఈ నిర్ణయంతో బీసీలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి రాజకీయ రంగాల్లో విశేషమైన అవకాశాలు వస్తాయని తెలిపారు. బీసీల అభ్యున్నతిని నిజాయితీగా కాంక్షించే వ్యక్తి రేవంత్ రెడ్డేనన్నారు. 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకై దళిత సోదరులు చేస్తున్న పోరాటాలను నిజం చేస్తూ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి దళితుల ఆశాజ్యోతిగా రేవంత్ రెడ్డి నిలిచిపోయారని అన్నారు. రానున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వనికి, ఐఎన్టియుసి కి ఉద్యోగులు అండగా ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వలో కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయన్నారు. నూతన గనులను దక్కాలంటే వేలం పాటలో పాల్గొనాలని మాకు మద్దతు ఇస్తున్న సంఘాన్ని కలుపుకొని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను కలుస్తామన్నారు.
సొంతింటి కలను నెరవేర్చేలా రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ కృషి చేస్తున్నారని అన్నారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య మాట్లాడుతూ... ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండల చైర్మన్ శ్రీ బి జనక్ ప్రసాద్ సింగరేణి కాపాడుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, సింగరేణి వేలంపాటకు వెళ్లి కొత్త గనులను తీసుకురావడానికి కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి సింగరేణి వివిధ అనుబంధ రంగాల్లో అడుగుపెట్టడానికి ఎంతో ఆలోచన చేస్తూ సింగరేణి పరిరక్షణకై నడుం బిగించారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను కాపాడుకునే ఉద్దేశంతో వారికి రూ 5000 బోనస్ ఇప్పించడం, వారికి వైద్య సదుపాయాలు, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. వారి నాయకత్వాన్ని ఉద్యోగులు అందరు బలపరచాలని కోరారు. కాసిపేట గనిలో ఉద్యోగులకు బెదిరింపులకు గురి చేస్తూ, చార్జి షీట్లు, సస్పెన్షన్ చేస్తూ మానసికంగా ఇబ్బందులు చేస్తే శశికాంత్ అనే ఉద్యోగి అస్వస్థతకు గురై హాస్పటర్ పాలైనారని, వారి పద్ధతులు మానుకోవాలని, ఈ వ్యవహారంలో డిప్యూటీ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ కార్యదర్శి పానుగంటి వెంకట స్వామి, కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శులు శంకర్ రావు, బన్న లక్ష్మన్ దాస్, ఏరియా నాయకులు సీద్రాల రాజన్న, పిట్ సెక్రెటరీ శనిగారపు రవీందర్, నాయకులు సోగాల కన్నయ్య, పిట్టల శివ కుమార్, అడెపు శ్రీకాంత్, దినేష్, సంపత్, నాగరాజు, అట్లా సంపత్, ముత్తమల్ల శ్రీనివాస్, బాల్త శ్రీనివాస్, సంతోష్ పాండే, కాసిపేట 2 ఇంక్లైన్ అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ చింతం రవి కిరణ్, గొల్ల రాజేందర్, గణపతి అంజి, కండే నవీన్, రామ్మోహన్, అయిల్లా రవి, రవి, ఉద్యోగులు, బిసి, ఎస్ సి సంఘాల నాయకులు, మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.