calender_icon.png 31 March, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎన్టియుసి క్యాలెండర్ ఆవిష్కరణ

11-03-2025 07:50:16 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాకలో ఐటిసి పిఎస్పిడి ఐఎన్టియుసి నూతన క్యాలెండర్-2025 ను మంగళవారం యూనిట్ హెడ్ శైలందర్ సింగ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మారం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... గత సంవత్సరం లాగే కార్మిక సోదరులందరూ భద్రత పాటిస్తూ ముందుకు సాగాలని, పరిశ్రమ అభివృద్ధి చెంది 8వ ప్లాంట్ త్వరగా ప్రారంభించే విధంగా యూనిట్ హెడ్ శైలందర్ కార్పొరేట్ స్థాయిలో చర్చించాలని కోరారు. అదేవిధంగా జరగబోయే 14వ వేతనం ఒప్పందం కూడా కార్మికులందరికి ఆమోదయోగ్యంగా ఉండేవిధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ హెడ్ శ్యామ్ కిరణ్, ఐఎన్టియుసి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గొనె రామారావు, యారం పిచ్చిరెడ్డి, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఐఎన్టియుసి కార్మిక నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.