calender_icon.png 11 January, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేస్‌బుక్‌లో పరిచయమై..

04-08-2024 02:14:20 AM

ఉద్యోగం ఇప్పిస్తానని వివాహితపై అత్యాచారం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఆన్‌లైన్‌లో ఉద్యోగం కోసం వెతుకుతున్న ఓ యువతికి  ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన ఓమహిళ బెంగుళూరులోని వర్చుసా కన్సల్టెన్సీలో 2022 నుంచి 2023 వరకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసింది. నూతన ప్రాజెక్టులు లేకపోవడంతో కంపెనీలో ఉద్యో గం కోల్పోయింది. ఈ క్రమంలో ఉద్యో గం  కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్న ఆమెకు హైదరబాద్‌కు చెందిన నర్సింహారెడ్డితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్ప డింది.

అప్పటికే బెంగుళూరులో ఉన్న ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్‌కు రావాలసిందిగా కోరాడు. అత న్ని నమ్మి ఆమె తన భర్త, కుమారుడితో మే 15న నగరానికి వచ్చింది. కాగా జూన్ 10న వెంగళ్‌రావు నగర్‌లోని కీస్ కన్సల్టెన్సీలో తనను కలిస్తే, అక్కడ ఆమె ప్రొఫైల్ అప్‌డేట్ చేద్దామని పిలిచాడు. అది నమ్మి అక్కడకు వెళ్లిన ఆమెను ఆ కన్సల్టెన్సీ ఆఫీస్‌లోని ప్రైవేటు రూమ్‌లో ఉంచి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పలేకపోయింది. కాగా కీస్ కన్సల్టెన్సీలో నర్సింహారెడ్డితో కలిసి పనిచేసే లవకుమార్ తనను కలవాలని పలుమార్లు వేధిస్తుండటంతో ఆమె విషయాన్ని తన భర్తకు చెప్పింది. ఈ క్రమంలో భర్తతో కలిసి శుక్రవారం బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.