calender_icon.png 22 December, 2024 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘హోలిస్టిక్’లో ఇంట్రవస్క్యులర్ అల్ట్రాసౌండ్ చికిత్స

22-12-2024 03:11:57 AM

శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంట్రవస్కులర్ అల్ట్రాసౌండ్ చికిత్స విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కొండాపూర్ మసీదుబండలోని శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్‌లో వైద్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ వికాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా స్టంట్‌ను తక్కువ సమయంలో అమర్చగలుగుతున్నామని తెలిపారు.

ఈ విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తక్కువ సమయంలో సులభంగా స్టంట్ వేయవచ్చని అన్నారు. రక్తనాలాలు ఎంత వరకు బ్లాక్ అయ్యాయో ఈ పరికరం ద్వారా తెలుసకొని సరైన సమయంలో చికిత్స చేయవచ్చునని తెలిపారు. స్టంట్ వేసాక కూడా స్టంట్ విస్తరించాలా లేదా అనేది ఈ పరికరం ద్వారా స్పష్టంగా తెలుస్తుందన్నారు. నూతన టెక్నాలజీ ప్రవేశపెట్టాకా భీమవరంకు చెందిన పేషంట్ నారాయణకు విజయవంతంగా చికిత్స చేశామని తెలిపారు. త్వరలోనే తెల్లాపూర్, కొల్లూర్, మొకిల వంటి ప్రాంతాల్లో మా హాస్పిటల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైద్యులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.