- ఆల్కహాల్‌తో ప్ల్లమ్ కేక్‌ల తయారీ
- కార్ఖానాలోని వ్యాక్స్ బేకరీపై ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (విజయక్రాంతి): నగరలోని కార్ఖానా ప్రాం ఆల్కాహాల్(రమ్) కలిపి ప్లమ్‌కేక్‌లను తయారుచేస్తున్న ఓ బేకరీపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు చేసిన దాడుల్లో విస్తుకల్పించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేకుల్లో ఆల్కాహాల్ కలుపుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు కార్ఖానాలోని వ్యాక్స్ బేకరీపై శనివారం ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.
బేకరీలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆల్కాహాల్ కలిపి ప్లమ్ కేకులను తయారు చేయడంతో పాటు తయారీ ప్రదేశంలో అపరిశుభ్ర వాతావరణం, సరైన రికార్డులను నిర్వహించ శిక్షణ పొందిన సిబ్బంది లేకపోవడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కేక్ తయారీ కోసం వినియోగించే అచ్చు పాత్రలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.
ఈ యూనిట్‌లో తయారు చేసిన ప్లంకేక్‌లు, బిస్కెట్లు, బ్రెడ్ మొదలైన ఆహార పదార్థాలకు ఫుడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ తేదీ, ఫుడ్ సేఫ్టీ లోగో, వెజ్ లోగోలకు సంబంధించిన సమాచారం ప్రదర్శించకపోవడాన్ని అధికారులు గుర్తించారు.
సెమీ ప్రిపేర్డ్ వెజ్, నాన్‌వెజ్ ఫుడ్ ఆర్టికల్స్ వంటి ఆహార, ఆహారేతర వస్తువులు కలిసి నిల్వ ఉంచడాన్ని కూడా గుర్తించారు. బేకరీ నుంచి పలు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.