calender_icon.png 9 October, 2024 | 9:59 AM

‘హిట్ 3’ సెట్‌లోకి..

03-10-2024 12:00:00 AM

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్-3 : ది థర్డ్ కేస్’. నానికి ఇది 32వ చిత్రం కాగా, ఆయన సరసన హీరోయిన్‌గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధిశెట్టి నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతుండగా.. ఈ తాజా షెడ్యూల్‌లో శ్రీనిధి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

ప్రస్తుతం, టీమ్ లీడ్ పెయిర్- నాని, శ్రీనిధిశెట్టికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. డాక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి సందర్భంగా 2025 మే 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్; మ్యూజిక్: మిక్కీ జె మేయర్.