calender_icon.png 3 April, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు

26-03-2025 01:51:06 AM

నల్లగొండ, మార్చి 25 (విజయక్రాంతి) : నల్లగొండ మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకానికి మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 19న ఇందుకు నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు చేసుకున్న వారిలో 15 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ చేసి సర్టిఫికెట్లను పరిశీలించారు.

ఎంపికైన వారి వివరాలను మెడికల్ కళాశాల వెబ్ సైట్లో పెడతామని ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి తెలిపారు. ఇంటర్వ్యూలను వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర, డాక్టర్ వినీలారాణి, డాక్టర్ మాతృ, స్క్రూటినీ కమిటీ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది పర్యవేక్షించారు.