calender_icon.png 27 September, 2024 | 4:53 PM

మంత్రులతో ముఖాముఖి

26-09-2024 02:16:25 AM

  1. సమస్యలపై మంత్రి దామోదర రాజనర్సింహకు 285 మంది అర్జీలు
  2. కంప్యూటర్‌లో నమోదు చేసిన గాంధీభవన్ సిబ్బంది
  3. మొదటిరోజు ౪ గంటలు కొనసాగిన ప్రజావాణి

హైదరాబాద్, సెప్టెంబర్ 25 ( విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్‌లో చేపట్టిన ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి అనూ హ్య స్పందన లభించింది.

వారానికి రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌కు రావాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇతర ప్రజా సమస్యలను స్వీకరించాలని పీసీసీ చీఫ్  మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రతిపాదించగా, బుధవారం మంత్రులతో ముఖాము ఖి కార్యక్రమం ప్రారంభమైంది. 

మొదటి రోజు దామోదర రాజనర్సిం హ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యా హ్నం 3 గంటల వరకు కొనసాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా 285 మంది వచ్చి, తమ సమస్యలను మం త్రికి విన్నవించారు.

ప్రజావాణి కార్యక్రమానికి ఆరోగ్య సమస్యలు, జీవో 317 బాధితు లు, భూ వివాదం, అక్రమ కేసులు, ఉద్యోగు ల బదిలీలు ఇలా అనేక సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. జీఓ 317 వల్ల ఇబ్బందులు పడుతన్నామని నర్సులు, గురుకుల టీచర్లు తదితర ఉద్యోగులు మంత్రి దామోదర రాజనరసింహకు వివరించారు.

ఏఎన్‌ఎం రిక్రూట్‌మెంట్‌లో వెయిటే జ్ మార్కులు ఇవ్వాలని 108 సిబ్బంది మంత్రికి విన్నవించుకున్నారు. 30 ఫిర్యాదులపై మంత్రి దామోదర అప్పటికప్పుడు అధికారులకు ఫోన్ చేసి పరిష్కారం చేశారు.

వచ్చిన మొత్తం దరఖాస్తులను పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశాల మేరకు గాంధీభవన్ సిబ్బంది శాఖల వారీగా కంప్యూట ర్‌లో నమోదు చేశారు. ఆయా శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులను పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ లేఖలను జత చేసి మంత్రులకు పంపించనున్నారు. 

గాంధీభవన్‌లో ఇది నిరంతర కార్యక్రమం : పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ 

కాంగ్రెస్ పార్టీ ప్రతీ కార్యకర్తను గౌరవిస్తుందని, అందుకే వాళ్ల కోసం గాంధీభవన్ లో ప్రజావాణి కార్యక్రమం పెట్టామని  పీసీ సీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఇక నుంచి ప్రతీ బుధవారం, శుక్రవారం గాంధీభవన్‌కు మంత్రులు వస్తారని, ప్రజ లు, కార్యకర్తలు ఇచ్చిన దరఖాస్తులను తీసుకుని సంబంధిత శాఖల అధికారులతో పరిష్కరించేందుకు కృషి చేస్తారని పీసీసీ చీఫ్ తెలిపారు. గాంధీభవన్‌లో జరిగే మంత్రుల తో ముఖాముఖి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ప్రజలు ప్రశాంతంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు.

సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం: మంత్రి దామోదర 

మంత్రులతో ముఖాముఖి కార్యక్ర మం ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి మంచి జరుగుతుందని మంత్రి రాజనర్సింహ అన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు అనే తేడా లేకుండా అందరి అర్జీలను తీసుకు ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపా రు. రాత్రికిరాత్రే సమస్యలు పరిష్కారమవుతాయని తాము అనుకోవడం లేదని, ఒక్కొక్కటిగా అన్నింటికీ  పరిష్కారం చూపుతామన్నారు.

ఆర్జీలను సంబంధిత శాఖలకు పంపిస్తామని, వీలైనవాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపుతామన్నా రు. గాంధీభవన్‌లో చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ గొప్ప ఆలోచన చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలను పెట్టుకు న్నారని, వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖలకు తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.