11-03-2025 07:45:45 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జి.యం. వి.కృష్ణయ్య ఆదేశాల మేరకు కారుణ్య నియామకాల కొరకు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగి వారసురాలికి జి.యం కార్యాలయంలో మంగళవారం ముఖాముఖీ (ఇంటర్వ్యూ) నిర్వహించారు. ఏరియా ఇంజనీర్ ఆర్. వి.నరసింహ రాజు మాట్లాడుతూ... ఇల్లందు ఏరియా స్టోర్ నుండి కారుణ్య నియామకాల కొరకు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగి వారసురాలికి వారి కుటుంబ సభ్యుల, సాక్షుల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అన్ని వివరాలు నమోదు చేయడమైనదని, ఇంటర్వ్యూలు పూర్తయిన తరువాత వారిని వైద్యపరీక్షల కొరకు పంపించి తరువాత నియామక ఉత్తర్వులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.జి.యం.(పర్సనల్) జి.వి.మోహన్ రావు, ఏరియా స్టోర్స్ ఎస్.ఇ (ఇ &యం)బి. నాగేశ్వరరావు, సీనియర్ పర్సనల్ అధికారి సాయి స్వరూప్ మరియు జూనియర్ అసిస్టెంట్ అపర్ణ, సింధు ప్రియా తదితరులు పాల్గొన్నారు.