జగిత్యాల అర్బన్, డిసెంబర్ 23 : సాధారణ ప్రయాణికులుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ తోటి మహిళల నుండి నగదు, బంగారు నగలను దొంగిలించిన అంతరాష్ర్ట దొంగల ముఠాలోని ఒక సభ్యురాలిని అరెస్టు చేశామని మరో ముగ్గురు మహిళలు పరారీలో ఉన్నారని జగిత్యాల డిఎస్పి రఘుచందర్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మహారాష్ర్టలోని నాగపూర్ పట్టణానికి చెందిన నలుగురు మహిళలు ఒక ముఠాగా ఏర్పడి వివిధ చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారని డిఎస్పీ తెలిపారు. వారం రోజుల క్రితం జగిత్యా ల పట్టణంలోని పాతబస్ స్టాండ్‌లో ఓ మహిళ బ్యాగ్ నుండి 37తులాల బంగారాన్ని దొంగలిం చారన్నారు. ఈ దొంగతనం కేసును చేదించేందుకు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యం లో ఎస్సులు కిరణ్ కుమార్, నజీర్ ఖాన్ కానిస్టేబుల్ జీవన్‌లతో టీమును ఏర్పాటు చేశామని వాళ్ల కృషితో వారం రోజుల్లోనే నేరస్తుల ఆచూకీ కనుక్కోవడం జరిగిందని తెలిపారు.
తమ అదుపులో ఉన్న ముఠాలోని సభ్యురాలి నుండి 31తులాల బంగారం రికవరీ చేసామని, మరో 7 తులాల బంగారం, ముగ్గురు నేరస్థులను త్వరలోనే పట్టుకుంటామని డి.ఎస్.పి తెలిపారు.
.