calender_icon.png 19 April, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

11-12-2024 01:19:43 AM

* 21 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

కరీంనగర్ సిటీ, డిసెంబర్ 10 (విజయక్రాంతి): నగరంలోని కట్ట రాంపూర్‌లో గత నెల 25న జరిగిన చోరీ కేసులో నిందితుడిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. కట్టరాంపూర్‌లోని శాతవాహన అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న ఉప్పుగండ్ల రాజమణి గత నెల 23న ఇంటికి తాళం వేసి బంధువులు ఇంటికి వెళ్లింది. 25న తిరిగి వచ్చేసరికి బీరువాలో దాచి ఉంచిన బంగారు నగల తోపాటు టీవీ చోరీకి గురైనట్లు గుర్తించి, రాజమణి కుమారుడు మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీ సులు.. మంగళవారం ఉదయం గౌత మ్‌నగర్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన కందుల సత్యనారాయణగా గుర్తించారు. అతడి నుంచి టీవీ, 21 తులాల బంగారు ఆభరణాలు, 46 తులాల వెండి వస్తువులు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.