calender_icon.png 31 January, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

30-01-2025 12:00:00 AM

మేడ్చల్, ఘట్కేసర్, జనవరి 29 (విజయ క్రాంతి) : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అంతర రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో ఈ ముఠా వివరాలను వెల్లడించారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సరస్వతి నగర్ కాలనీలో నివాస ముంటున్న గుజరాత్‌కు చెందిన గుజరాతి కిషన్, ఢిల్లీకి చెందిన రామ్ లాల్, శ్యాంలాల్, కోలి, గుల్షన్, దీపక్ తో పాటు ఒక మైనర్ బాలుడు ముఠాగా ఏర్పడ్డారు.

వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో వివిధ రకాలుగా దొంగతనాలు, మోసాలకు పాల్పడ్డారు. ఈనెల 21న భువనగిరి బస్ స్టేషన్ వద్ద ఒక మహిళ దృష్టి మళ్లించి బంగారు గొలుసు ఎత్తుకెళ్లా రు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా ఈ ముఠా మోసాలు, దొంగతనాలు బయట పడ్డాయి. వీరిపై భువనగిరి, హుస్సేనీ ఆలం, దుండిగల్, జీడిమెట్ల, అఫ్జల్ గంజు, పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వీరి వద్ద రూ.17 లక్షల విలువచేసే 232 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

ప్రతి ఒక్కరూ రోడ్డు  భద్రత నియమాలు పాటించా లని సిపి సుధీర్ బాబు అన్నారు. ఘట్కేసర్ మండలం లోని అంకుసాపూర్ గ్రామంలోని ఏసీఈ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన రోడ్డు భద్రత అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సమావేశంలో డిసిపిలు మనోహర్, మల్లారెడ్డి, శ్రీనివా సులు, ఏసీపీ చక్రపాణి, చీఫ్ కోఆర్డినేటర్ ఎంఎస్ సావిత్రి, ఎం ఆర్ రాజేష్, జగన్ యాదవ్, సూర్యనారా యణ, సిఐలు పరశురాం, రాజు వర్మ పాల్గొన్నారు.