ఐదు సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్న స్మగ్లర్...
సంగారెడ్డి (విజయక్రాంతి): అంతరాష్ట్ర మద్యం స్మగ్లర్ను జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాకు చెందిన హరీఫ్ ఖాన్ జాతీయస్థాయిలో మద్యం స్మగ్లింగ్ చేస్తారని తెలిపారు. ప్రభుత్వానికి ఎలాంటి పనులు చెల్లించకుండా అక్రమంగా పలు రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు చేస్తున్నారని వివరించారు. మద్యం స్మగ్లర్ అరిఫ్ ఖాన్ పై జహీరాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో 2014-15 సంవత్సరంలో కేసులో నమోదు కావడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాలుగా నాన్ బేలబుల్ వారెంట్ జారి కావడం జరిగిందన్నారు.
కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న రేపు కాను అరెస్టు చేసేందుకు రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ ఏర్పాటు చేశారన్నారు. అంతర్రాష్ట్ర మద్యం స్మగ్లర్ను పట్టుకునేందుకు జహీరాబాద్ ఎక్సైజ్ శ్రీనివాస్ రెడ్డి ఎస్ఐలు రమేష్, హనుమంతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నారు. నమ్మదగ సమాచారం మేరకు అంతరాష్ట్ర మద్యం స్మగ్లర్ గోవలో ఉన్నట్టు తెలుసుకొని ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి అరెస్టు చేసిందన్నారు. గురువారం అంతరాష్ట్ర మద్యం స్మగ్లర్లు జహీరాబాద్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ కు తరలించారని తెలిపారు.