calender_icon.png 16 January, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

12-07-2024 12:18:25 AM

జగిత్యాల, జూలై 11(విజయక్రాం తి): అంతర్రాష్ర్ట గంజాయి ముఠాను ధర్మపురి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను  అరెస్టు చేశా రు. వీరిలో ఒడిశా, ఏపీకి చెందిన చిరువ్యాపారులు కాగా, గంజాయి కొనుగోలు చేసిన వ్యక్తి ధర్మపురి మండలంలోని దొంతాపూర్‌కు చెం దినవాడని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. బత్తి ని చందు, గొల్ల వెంకటేశ్, దుర్గం రాములుపై కేసు నమోదు కాగా బత్తి ని చందు, గొల్ల వెంకటేశ్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పం పామని తెలిపారు. రాములు పరారీ లో ఉన్నాడని చెప్పారు. నిందితుల వ ద్ద 6.03 కేజీల గంజాయి సాధీనం చేసుకున్నట్టు వివరించారు.