చేవెళ్ల, నవంబర్ 25: సెంట్రింగ్ బాక్సులు, రాడ్స్‌ను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను చేవెళ్ల పోలీసులు పట్టుకున్నారు. చేవెళ్ల పీఎస్‌లో సీఐ భూపాల్ శ్రీధర్, డిటెక్టివ్ సీఐ రమేశ్ నాయుడు సోమవారం వివరాలు వెల్లడించారు. ముషీరాబాద్ పరిధి గోలక్ పూర్‌కు చెందిన మోసిన్ అహ్మద్ యూపీకి చెందిన 17 మంది లేబర్లతో ముఠాగా ఏర్పడి సెంట్రింగ్ బాక్సులు, జాకీలు, రాడ్స్ దొంగతనానికి పాల్పడ్డా రు. వీరిపై జిల్లాలో పలు కేసులు నమోదయ్యాయి.
దీంతో వీరిపై నిఘా పెట్టిన పోలీసులు చేవెళ్ల మండలం ముడిమ్యాల గేట్ దగ్గర నిర్మాణంలో ఉన్న భవనం యజమానులు రిజ్వాన్, అహ్మద్‌తో కలిసి నిందితులను పట్టుకునేం దుకు ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే అదేరోజు రాత్రి అక్కడే రెక్కి నిర్వహించారు. అనుమానించినట్లే నిందితులు అక్కడికి రాగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా ప్రధాన నిందితుడు మోసిన్ అహ్మద్‌ను కూడా పట్టుపకున్నారు. మరో పది మంది పరారీలో ఉన్నారు.