* ఇద్దరి అరెస్టు, 190 గ్రాముల హెరాయిన్ స్వాధీనం
* వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుధీర్‌బాబు
మేడ్చల్, జనవరి17: రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అంతర్ రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేయడంతో పాటు 23 లక్షల విలువైన 190 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్‌బాబు శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన మహేశ్, మహిపాల్.. గత కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ డ్రగ్స్ విక్రయాలు చేపట్టడంతో పాటు ఒక టీంను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం ముఠాసభ్యులు రాచకొండ పరిధిలో హెరాయిన్ విక్రయాలకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారం మేరకు హయత్‌నగర్ ఎస్‌వోటీ, నేరెడ్‌మెట్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద 190 గ్రాముల హెరాయిన్, ఒక బైక్, రెండు సెల్‌ఫోన్లు, వెయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2024 నుంచి ఇప్పటివరకు రూ.88.33 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు.