calender_icon.png 24 February, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ అరెస్ట్

21-02-2025 12:00:00 AM

60 గ్రాముల ఎండీ ఎంఏ డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 20: అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్ శతాబ్ది మన్నాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద 60 గ్రా ఎండీ ఎంఏ డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు.. బెంగళూర్ కు చెందిన శతాబ్ది మన్నా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.

అక్కడ చదువుతున్నప్పుడే సహా విద్యార్థి ఆఫ్రికాకు చెందిన వారెన్ కొకరంగోతో పరిచయం ఏర్పడింది. దీంతో పాటు ఆమెకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో డ్రగ్స్ సరఫరా వైపు మళ్ళింది.  కాగా ఆమె గత కొంతకాలంగా బెంగుళూరు నుండి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

బుధవారం  టీజీ న్యాబ్,సైబరాబాద్ మియాపూర్ పోలీసులు పక్కా సమాచారంతో బెంగళూర్ నుండి నగరానికి డ్రగ్స్ సప్లై చేసేందుకు వచ్చిన మహిళ శతాబ్ది మున్నా (24) ను అరెస్ట్ చేశారు.నిందితురాలు వద్ద రూ .6 లక్షల  విలువ చేసే 60 గ్రా ఎండీఎంఎ డ్రగ్స్,మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.ప్రధాన నిందితుడు ఆఫ్రికా కు చెందిన వారెన్ కొకరంగో పరారీలో ఉన్నాడు.