calender_icon.png 21 April, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

12-04-2025 12:19:31 AM

    - నాలుగు లీటర్ హాష్ ఆయిల్ పట్టివేత 

    - ఇద్దరి అరెస్టు 

    - వివరాలు వెల్లడించిన రాచకొండ సి పి సుధీర్ బాబు 

మేడ్చల్, ఏప్రిల్ 11 (విజయ క్రాంతి): రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్ ఓ టి, భువనగిరి రూరల్ పోలీసులు అంతర రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు నేరేడ్ మెట్ లోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గబ్బడ గ్రామానికి చెందిన పెట్ల శేఖర్ బీఎస్సీ కెమిస్ట్రీ చదివి ఇంటి వద్ద పని లేకుండా ఉంటున్నాడు. హైదరాబాదులో గంజాయి సరఫరా చేసే గంజాయి దుర్గా తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకొన్నాడు. అదే గ్రామానికి చెందిన అనిమిరెడ్డి దుర్గారావు తో కలిసి నాలుగు లీటర్ ల హాష్ ఆయిల్ తీసుకొని హైదరాబాద్ బయలుదేరారు.

భువనగిరి రైల్వే స్టేషన్ లో దిగగా అనుమానాస్పదగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. వారి వద్ద హాష్ ఆయిల్ పట్టుబడింది. దీంతో వీరిని అరెస్టు చేసి,హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.80 లక్షలు ఉంటుంది. రెండు సెల్ ఫోన్లు సీజ్ చేశారు. సిపి పర్యవేక్షణ లో, భువనగిరి డిసిపి ఆకాంక్ష యాదవ్, ఎస్ ఓ టి, డి సి పి రమణారెడ్డి సూచనలతో నిందితులను పట్టుకోగలిగారు. నిందితులను పట్టుకున్న పోలీసులను సిపి అభినందించారు.