calender_icon.png 2 April, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచారణ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

29-03-2025 08:20:07 PM

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి..

భద్రాచలం (విజయక్రాంతి): విచారణ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి కోరారు. భద్రాచలం స్పెషల్ సబ్ జైలును శనివారం సందర్శించారు. ఈ సందర్భంగ విచారణ ఖైదీలతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసిన నేరాలతో ఖైదీలుగా మారి జైలు జీవితం గడపాల్సి వస్తుందని తద్వారా తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు.

విచారణ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని తెలిపారు. ఈ సందర్భంగ జైలులో ఉన్నటువంటి ఖైదీలకు విచారించి న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాదిని నియమించనున్నట్లు తెలిపారు. జైలు పరిసరాలు, ఖైదీలకు వడ్డించే ఆహారం, సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితిల గురించి విచారించారు. ఖైదీలలో మార్పుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు పాల్గొన్నారు.