calender_icon.png 18 April, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతీ ఇంటికి ఇంటర్నెట్

11-04-2025 01:28:14 AM

  1. 8,891 పంచాయతీలు అనుసంధానం.. మరో 7,187 జీపీలు సిద్ధం
  2. టీ ఫైబర్ ఇక టీ నెక్ట్స్ 
  3. బేగంపేటలో కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాం తి): తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రతీ ఇంటికి, కార్యాలయానికి తెలంగాణ ఫైబర్‌నెట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు కల్పించను న్నట్టు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. కేబుల్ ఆపరేటర్ల సహకారంతో టీవీ ఛాన ల్స్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు.

హైదరాబాద్ బేగంపేటలో టీ ఫైబర్ నూతన కార్యాలయాన్ని గురువారం మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీవీ సెట్లను కంప్యూటర్ మానిటర్‌గా వాడుకొని విద్యార్థులు ప్రయోజనం పొందేలా టెక్నాలజీని రూపొందించామన్నారు. టీ ఫైబర్ ఇప్పటికే 424 మండలాల్లోని 8,891 గ్రామపంచాయతీలను అనుసంధానం చేసిందని చెప్పారు.

మరో 7,187 పంచాయతీలు ఈ సేవలను అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది 30వేల ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్టివిటీ కల్పించామని చెప్పారు. 2027 నాటికి 60వేల కార్యాలయాలను అనుసంధానం చేస్తామని వివరించారు. టీ ఫైబర్ ఇకపై T-- పేరుతో సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.

కార్యక్రమంలో వ్యాపార భాగస్వాములతో 9 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా టీ ఫైబర్ కొత్త లోగోను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన డేటాను సురక్షితంగా ఉంచగల సావరిన్ క్లౌడ్‌ను ప్రారంభించిన మంత్రి, టీ ఫైబర్ కోసం కొత్త విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు.

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా శ్రీధర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్‌మిశ్రా, టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ పన్నేరు, పలువురు అధికారులు పాల్గొన్నారు.