calender_icon.png 9 January, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయంగా ఐమాక్స్‌లో..

04-01-2025 12:00:00 AM

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. అనిత సమర్పణలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, ఎస్‌జే సూర్య, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో అలరించనున్నారు.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10 నుంచి అలరించనుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సినిమాను లార్జర్ స్క్రీన్‌లో చూస్తే కలిగే అనుభూతే మరో రేంజ్‌లో ఉంటుంది. అందులో భాగంగా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభవాన్ని అందించటానికి ఐమ్యాక్స్‌లో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

సినిమాలో వావ్ అనిపించే విజువల్స్, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో పక్కాగా రూపొందిన ఈ చిత్రం మన దేశంతో పాటు అంతర్జాతీయంగా ఐమాక్స్ థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. “చక్కటి కథ, సాంకేతికతతో హద్దులను దాటేలా సినిమాను రూపొందిస్తే మనం ఏం చేయగలమనే విషయం గేమ్ చేంజర్ సినిమాతో తెలుస్తుంది.

ఐమాక్స్‌లో గేమ్ చేంజర్ సినిమా ప్రదర్శితం కానుందని తెలిసి నాకెంతో ఆనందమేసింది. సినిమాను విజువల్ వండర్‌గా, భారీదనంతో రూపొందించాం” అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ “గేమ్ చేంజర్’ మూవీ నా హృదయానికెంతో దగ్గరైన చిత్రం.

శంకర్‌గారితో కలిసి ఈ సినిమా కోసం పని చేయటం మరచిపోలేని అనుభూతి. ఈ సినిమాను ఇప్పుడు ప్రేక్షకులు ఐమాక్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని తెలియటంతో నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది” అన్నారు.