09-03-2025 12:32:33 AM
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): టీఎన్జీవోస్ యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలో టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌లో అంతర్జాతీయ మహి ళా దినోత్సవం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీజీజేఏసీ సెక్రెటరీ జనరల్, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. మహిళలు పోరాటం ద్వారానే తమ హక్కులను సాధించుకుంటారని చెప్పారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతిభాయి మాట్లాడుతూ.. ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉన్న తమ వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
స్థానిక కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ మహిళా సాధికారతకి తన వంతు కృషి చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ మహిళా విభాగం చైర్‌పర్సన్ జి.మృదుల, కన్వీనర్ బి.వి. సుబ్బమ్మ, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొనిదెన శ్రీనివాస్, ట్రెజరర్ వల్లపు వెంకన్న, ఉపాధ్యక్షురాలు లలిత కుమారి, జాయింట్ సెక్రెటరీ శీలం రాధికారెడ్డి, కార్యవర్గ సభ్యురాలు నెల్లూరి విజయ, నాగలక్ష్మి, మహిళా విభాగం కార్యవర్గం వెంకటమ్మ, భావన వెన్నెల, కోమలి, శ్రావణి, సుజాత, జోత్స్న, హసీనా, వసంత, రమ్య, రాంబాయి, షేక్ జరీనా, పద్మావతి, శ్యామల, లక్ష్మి, మాధురి, నాగలక్ష్మి, ఫాతిమా ఫార్హీన్, మాణిక్యం, రమాదేవి, పార్వతి, హిమబిందు పాల్గొన్నారు.