11-03-2025 07:53:58 PM
చదువుతోనే మహిళల అభివృద్ధి సాధ్యం
ఆర్థికంగా అభివృద్ధి సాధించినప్పుడే సమాజంలో గౌరవం
టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి,(విజయక్రాంతి)/జహీరాబాద్: మహిళలు అన్ని రంగాలలో ముందుకు పోవాలంటే చదువుకోవాలని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి(TGIIC Chairman Nirmala Jagga Reddy) తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణ సమీపంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు(International Women's Day Celebrations) నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం, డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రతి మహిళా చదువుకున్నప్పుడు ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. మహిళలు తమ పిల్లలను చదివిపించేందుకు ముందుకు రావాలన్నారు. చదువుతోని సమాజంలో గౌరవం వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ ముఖ్య ప్రధాన జనరల్ మేనేజర్ ఉదయభాస్కర్, ఆర్ఎస్ ఈటిఐ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, నాబార్డ్ డీజీఎం స్వాతి తివారి, సఖి సంస్థ ప్రతినిధి కల్పన, నాబార్డ్ డీడీఎం కృష్ణ తేజ, నిఖిల్ రెడ్డి, కెవికె శాస్త్రవేత్త వరప్రసాద్ తోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, మహిళలు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులుపాల్గొన్నారు.