calender_icon.png 9 March, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ రాగా పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళాదినోత్సవం

09-03-2025 08:42:23 AM

భద్రాద్రి,(విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ రాగా స్కూల్(Sri Raga School)లో మహిళా దినోత్సవ వేడుకలు(International Women's Day Celebrations) ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కరస్పాండెంట్ మల్లారపు, వర ప్రసాద్ హాజరై, మహిళా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్నిరంగాల్లో రానిస్తూ కుటుంబ పోషణలో పురుషులతో పాటు సమానంగా విజయాన్ని సాధిస్తూ తమ కుటుంబాలను అహర్నిశలు  కాపాడుకుంటూ సమాజంలో మహిళలు చాలా శక్తివంతంగా నిలుస్తున్నారన్నారు.

ముందుగా స్కూల్ డైరెక్టర్ మల్లారపు.కవితని శాలువాతో జ్ఞాపికలతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కవిత మహిళ కావటం వల్ల కుటుంబాన్ని ఎలా చూసుకుంటారో అలా  పాఠశాలను, పిల్లలను తోటి ఉపాధ్యాయులను గౌరవిస్తూ సేవాభావంతో వుంటూ ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా, వాటిని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ముందుకు వెళ్తూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అనంతరం యాజమాన్యం  ఉపాధ్యాయురాళ్లను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. అంతేకాక మహిళా ఆయమ్మలను కూడా సన్మానించి జ్ఞాపికలు అందించారు.ఈ కార్యక్రమంలో రాంబాబు, రాంసింగ్, సర్వేశ్వరరావు, అనుష, జ్యోతి, ధనలక్ష్మి, హైందవీ, హారిక, శోభ రాణి, కౌసర్, గాయత్రి, రేష్మ, నౌషిన్ మొదలగువారు పాల్గొన్నారు.