calender_icon.png 13 March, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ మనుగడకై తెగించి పోరాడాలి

07-03-2025 05:39:44 PM

మహిళ దినోత్సవ సభలో ఐద్వా మండల కార్యదర్శి ఆలేటి సంధ్య పిలుపు

ఇల్లెందు,(విజయక్రాంతి): నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అకృత్యాలు, లైంగిక దాడులకు వ్యతిరకంగా మహిళ తెగించి పోరాడాలని ప్రతి మహిళ స్వతంత్రంగా ఒక సైనికురాలిగా ఎదగాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) ఇల్లందు మండల కార్యదర్శి ఆలేటి సంధ్య పిలుపునిచ్చారు. ఇల్లందు మండలం దేవులపల్లి యాకయ్య నగర్ లో జరిగిన ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జరిగిన సవరణ ఉద్దేశించి ఐద్వా మండల కార్యదర్శి ఆలేటి సంధ్య మాట్లాడుతూ.. సమాన వేతనం, లైంగిక వివక్షత, మహిళ హక్కులు, పురుషులతో కలిపి సమాన హక్కులు, కోసం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన శ్రామిక మహిళ జరిపిన పోరాటాల ద్వారా ఈ మహిళ దినోత్సవం ఏర్పడి ఆ నాటి నుండి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం అని అన్నారు.

మనువాదంతో మళ్ళీ తిరిగి ఈ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లి భూస్వామ్య సమాజంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు మళ్ళీ పురారవృతం అయ్యే లాగా మళ్ళీ చదువుకు దూరంగా, పితృ స్వామ్య సమాజంలోకి మార్చే విధంగా ఆర్ ఎస్ ఎస్, బీజేపీ మనువాడాన్ని ముందుకు తీసుక వస్తుందనీ అన్నారు. హర్యానాలో జై శ్రీరామ్ అనకపోతే మహిళ పై అత్యాచారం జరిపిన  వారిపై ఎటువంటి చర్యలు కూడ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో  జగిత్యాల ఆశ వర్కర్ పై  లైంగిక దాడి జరిపిన నిందుతినిపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు  పెట్టి అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. మహిళ పోరాట స్ఫూర్తి నీ అలవరుచుకొని సమాజాన్ని అధ్యయనం చేయాలనీ శాస్త్రీయ అవగాహనతో మెలగాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ సంక్షేమ పథకలు మహిళ అభివృద్ధికి ఏమేరా ఉపయోగపడుతున్నాయో పరిశీలన చేయాలనీ అన్నారు. మహిళను ఓటర్ గా కాకుండా  తోబుట్టువ్ గా భావించి హక్కులు కల్పించి, చట్టాలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ సభలో వ్యవసాయ కార్మిక సంఘం,ఐద్వా మండల అధ్యక్షురాలు మునిగంటి లక్ష్మి, తాళ్లూరి పద్మ, కడారి వెంకటమ్మ, సంతోష, వసంత, సుజాత, నీలరాణి, తోలేం కుమారి, భవాని, పద్మ, రాంబాయి, జ్యోతి, కౌసల్య, తదితరులు పాలొన్నారు.