22-02-2025 05:38:54 PM
పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
కోదాడ,(విజయక్రాంతి): పట్టణంలోని కట్ట సాయి భవాని మెమోరియల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కవల పిల్లల అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థినిలకు పరీక్షా సామాగ్రి పంపిణీ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చలిగంటి రామారావు, కొల్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రపంచ కవల పిల్లల దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఏడాది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. మార్చి రెండవ తారీకు కూడా పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్ట సాయి భవాని మెమోరియల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ స్వరూప రాణి, జయ పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, కవల పిల్లల తల్లిదండ్రులు రామారావు, సత్యనారాయణ చారి, అహమద్, చంద్రకాంత్ స్వామి, సురేష్, గోపవరపు మహేష్, చల్లా నటరాజ్, శరత్ కుమార్ , ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.