9 మంది విదేశీ యువతుల అరెస్ట్
పరారీలో ఉన్న నిందితుడు
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): గచ్చిబౌలి(Gachibowli)లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సెక్స్ రాకెట్(International Sex Racket) గుట్టురట్టయింది. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో వ్యభిచార కేంద్రంపై మాదాపూర్ ఎస్ఓటి, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేసిన 9 మంది విదేశీ యువతులను అదుపులోకి తీసుకుని స్టేట్ హోమ్ కు తరలించారు. వీరంతా కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ కు చెందిన యువతులుగా గుర్తించారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నడుపుతున్న నిర్వాహకులు ఇతర దేశాలకు చెందిన యువతులతో ఆన్లైన్ వెబ్ ద్వారా ఆర్గనైజ్డ్ గా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డి టీఎన్జీవో కాలనీలో ఓ ఇండిపెండెంట్ హౌస్లో ఈ సెక్స్ రాకెట్ నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సదరు ఇంటిపై దాడి చేసి,సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఈ దాడిలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.ఆ నివాసంలో ఎక్కువ సంఖ్యలో విదేశీ యువతులే ఉండటం గమనార్హం. అయితే వ్యభిచార గృహ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.