21-02-2025 07:36:50 PM
చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం.సుధాకర్ ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతృభాష భాష గొప్పతనం, ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలుగు ఉపాధ్యాయుదు గట్టు రఘు మాతృభాష గొప్పతనం గురించి పిల్లల చేత నృత్యం రూపంలోనూ, పాటల రూపంలో, పద్యాలతో ఉత్సాహంగా మాతృభాష దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రణీత, స్వాతి, విజయశాంతి, పల్లవి, ప్రవీణ్ కుమార్, సుజాత, రమేష్, రాజయ్య, ప్రసాద్, నాగరాజు, ఓదేలు, సిఆర్పి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.