22-02-2025 12:00:00 AM
చిట్యాల, ఫిబ్రవరి 21 : మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలుగు భాష ఉపాధ్యాయుడు గడ్డం శంకర్, తుమ్మ మౌనిక ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులందరికీ తెలుగు భాష గొప్పతనం తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి, స్టాఫ్ సెక్రటరీ కూచనపల్లి శ్రీనివాస్, బొమ్మ రాజమౌళి ,సాంబారు రామనారాయణ,తెలుగు భాష ఉపాధ్యాయులు గడ్డం శంకర్, సుజాత నీలిమారెడ్డి ,విజయలక్ష్మి, ఉస్మానాలి కల్పన, గడ్డం శంకర్, తుమ్మ మౌనిక, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సూదం సాంబమూర్తి ,తదితరులు పాల్గొన్నారు.
నైన్‌పాక జడ్పీ పాఠశాలలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్‌పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం.సుధాకర్ ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రణీత, స్వాతి ,విజయశాంతి, పల్లవి, ప్రవీణ్ కుమార్, సుజాత ,రమేష్, రాజయ్య, ప్రసాద్, నాగరాజు, ఓదేలు, సిఆర్పి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.