calender_icon.png 28 December, 2024 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ మీడియా కథనాలు

28-12-2024 02:47:09 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై అంతర్జాతీయంగా పలు దేశాల ప్రతినిధులతో పాటు మీడియా కూడా సంతాపం తెలిపింది. ఆయన సేవల్ని గుర్తు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. 

న్యూయార్క్ టైమ్స్: మన్మోహన్ సింగ్ మిత భాషి, మృదు స్వభావి. భారత్‌ను ఆర్థిక సంక్షభాల నుంచి కాపాడి, చైనాకు పోటీ ఇచ్చేంత స్థాయిలో దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసినట్లు తన కథనాల్లో తెలిపింది. 

అసోసియేటెడ్ ప్రెస్: ఆర్థిక సంక్షభం నుంచి మన్మోహన్ సింగ్ భారత దేశాన్ని ఎలా గట్టేక్కించారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇవాళ ఎలా ఫలాలు అందిస్తున్నాయో వివరించింది. 

వాషింగ్టన్ పోస్ట్: భారత్, అమెరికా సంబంధాలు బలోపేతం కావడంలో మన్మోహన్ సింగ్ పాత్రను ప్రశంసించింది. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 21వ శతాబ్దపు నిర్మాణంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. అలాగే 2005లో జరిగిన ఇరు దేశాల మధ్య జరిగిన అణు ఒప్పందాన్ని హైలెట్ చేసింది. 

రాయిటర్స్: నేడు భారత్ ఆర్థికంగా శరవేగంగా వృద్ధి చెంది పరుగులు తీయడానికి కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడటానికి కారణం మన్మోహన్ సింగ్ నిర్ణయాలే అని కొనియాడింది. విముఖత అంటే తెలియని రాజుగా ఆయనను అభివర్ణించింది. 

అల్ జజీరా: మీడియా, ప్రతిపక్షాల కంటే చరిత్ర తనపై ఎక్కువ కరుణ, ప్రేమ చూపిస్తాయంటూ 2014లో మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు  చేసింది. సౌమ్యమైన లక్షణం కలిగిన సాంకేతిక నిపుణుడిగా ఆయనను అభివర్ణించింది. 

బీబీసీ: ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా మన్మోహన్ సింగ్‌ను కొనియాడింది. 1991లో ఆర్థిక మంత్రిగా, 2004 ప్రధాన మంత్రిగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడంలో ఆయన చేసిన కృషిని ప్రశంసించింది. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లపై బహిరంగ క్షమాపణలు కోరినట్టు గుర్తు చేసింది. ఆ ఘటన ఆయన వ్యక్తిగత చిత్తశుద్ధిని తెలియజేస్తుందని పేర్కొంది.